Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి వాహనంపై రాళ్ల దాడి!

CPI leader Chada Venkat Reddys car attacked
  • పార్టీ కార్యాలయం వద్ద పార్కింగ్ లో ఉన్న చాడ కారు
  • రాళ్లు రువ్విన ఇద్దరు దుండగులు
  • ఆరెస్సెస్ వాళ్లే ఈ పనికి పాల్పడి ఉండొచ్చన్న చాడ
తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయం మఖ్దూంభవన్ వద్ద నిలిపి ఉంచిన కారుపై ఇద్దరు యువకులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు దాడిని అడ్డుకోవడానికి అక్కడి భద్రతా సిబ్బంది ప్రయత్నించారు. సమీపంలో ఉన్న పార్టీ  కార్యకర్తలను కూడా పిలిచారు. ఈలోగానే వారు ద్విచక్ర వాహనంపై పారిపోయారు. పోతూపోతూ కార్యాలయం గోడ పక్కన నిలిపి ఉంచిన మరో కారును కూడా ధ్వంసం చేశారు.

దాడి జరిగిన సమయంలో చాడ తన నివాసంలో ఉన్నారు. లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టంపై నిర్వహిస్తున్న ఆన్ లైన్ సదస్సులో ఆయన పాల్గొంటున్నారు. ఈ సమయంలో తన వాహనంపై దాడి జరిగిందనే విషయాన్ని తెలుసుకున్న చాడ... వెంటనే సదస్సును ముగించుకుని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జరిగిన ఘటనను ఖండించారు. ఆరెస్సెస్ భావజాలం ఉన్నవారే ఈ పనికి పాల్పడి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.
Chada Venkat Reddy
CPI
Car
Damaged

More Telugu News