ఏపీలో ఇంకా తగ్గని కరోనా కల్లోలం
- ఒక్కరోజులో 66 మంది మృతి
- కొత్తగా 9 వేలకు పైగా పాజిటివ్ కేసులు
- 10,131 మంది డిశ్చార్జి
ఇక రాష్ట్రవ్యాప్తంగా 66 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు సంభవించాయి. తద్వారా ఓవరాల్ కరోనా మృతుల సంఖ్య 4,912కి పెరిగింది. తాజాగా 10,131 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 95,072 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,67,139గా నమోదైంది.