గదిలోకి తీసుకెళ్లిన ఓ డైరెక్టర్ బ్లూ ఫిల్మ్ చూపించాడు... ఓ చానెల్ ఇంటర్వ్యూలో నటి పాయల్ ఘోష్ వ్యాఖ్యల వీడియో!
- డ్రగ్స్ వాడితే యాక్టివ్ గా ఉంటామని నటీనటులు భావిస్తారు
- ఒంట్లో బాగాలేదని ఆ డైరెక్టర్ నుంచి తప్పించుకున్నా
- డ్రగ్స్ వాడేవారంతా బానిసలు కాదన్న పాయల్
ఆపై మరే ఇతర డైరెక్టర్ నుంచి తనకు ఇదే విధమైన అనుభవం ఎదురు కాలేదని చెప్పిన పాయల్, డ్రగ్స్ ప్రస్తావన వస్తే, తాను దూరంగా ఉంటానని చెప్పింది. సుశాంత్ కొన్ని సంవత్సరాలుగా తనకు తెలుసునని, అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడని భావించడం లేదని తెలిపింది. గతంలో ఓ క్రికెటర్ తో డేటింగ్ చేశానని, అతనితో బ్రేకప్ తో తీవ్ర మానసిక వేధన అనుభవించానని, సుదీర్ఘకాలం పాటు చికిత్స తరువాత కోలుకున్నానని వ్యాఖ్యానించింది. చిత్ర పరిశ్రమలో చాలా మంది మాదకద్రవ్యాలు వాడుతున్నా, వారంతా బానిసలు కాదని, పరిస్థితులను చూసి అలవాటు పడుతున్నారని చెప్పుకొచ్చింది. పాయల్ వ్యాఖ్యల వీడియోను మీరూ చూడవచ్చు.