Thakeray: బాల్ థాక‌రే భ‌య‌ప‌డిన‌ట్లే జ‌రిగింది!: వీడియో పోస్ట్ చేసిన‌ హీరోయిన్‌ క‌ంగన

Great Bala Saheb Thakeray one of my most favourite icons his biggest fear was some day Shiv Sena
  • శివ‌సేనపై కంగ‌న‌ మండిపాటు
  • కాంగ్రెస్ తో శివ‌సేన  క‌ల‌వాల్సి వ‌స్తుందేమోన‌న్న భ‌యం
  • ప్ర‌స్తుతం త‌న పార్టీ ప‌రిస్థితిని చూస్తే ఆయ‌న ఎలా ఫీల్ అవుతారో
ముంబైలో చోటు చేసుకుంటోన్న ప‌రిణామాల నేప‌థ్యంలో శివ‌సేన పార్టీపై విరుచుకుప‌డుతోన్న హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్.. తాజాగా బాల్ థాక‌రేకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసి మ‌రోసారి ఆ పార్టీపై విమ‌ర్శలు గుప్పించింది. త‌న ఫేవ‌రెట్ ఐకాన్ల‌లో ఒక‌రైన బాలా సాహెబ్ థాక‌రే గ‌తంలో చేసిన ప‌లు వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేస్తున్నాన‌ని ఆమె తెలిపింది.

కాంగ్రెస్ కూట‌మిలో ఏదో ఒక‌రోజు శివ‌సేన క‌ల‌వాల్సి వ‌స్తుందేమోన‌న్న‌దే త‌నకున్న భ‌యమ‌ని బాల్ థాక‌రే అన్నార‌ని ఆమె పేర్కొంది. ప్ర‌స్తుతం త‌న శివ‌సేన పార్టీ ప‌రిస్థితిని చూస్తే ఆయ‌న ఆత్మ‌ ఏ విధంగా ఫీల్ అవుతుందోన‌ని ఆమె ట్వీట్ చేసింది. కాగా, ఇటీవ‌లే ఆమె శివ‌సేనను సోనియా సేన‌గా అభివ‌ర్ణించి విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో పాటు, శివ‌సేన నేత సంజ‌య్ రౌత్ పై ఆమె మండిప‌డుతోంది.
Thakeray
kangana ranaut
Bollywood
Maharashtra
Shiv Sena

More Telugu News