Diana Rigg: 'అవెంజర్స్', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' నటి డయానా రిగ్ కన్నుమూత!

Game of Throns Actress Diana Rigg Passes Away
  • 82 ఏళ్ల వయసులో క్యాన్సర్
  • ఆరు నెలల చికిత్స తరువాత మృతి
  • సంతాపం తెలిపిన ప్రముఖులు
1960 దశకంలో అందాల నటిగా కుర్రకారును ఉర్రూతలూగించి, బాండ్ గర్ల్ గా పేరు తెచ్చుకుని, ఆపై సీనియర్ నటిగా 'అవెంజర్స్', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' వంటి టెలివిజన్ సీరీస్ లోను, సినిమాలలోను నటించి, మెప్పించిన బ్రిటిష్ నటి డయానా రిగ్ కన్నుమూశారు.

ఆమె వయసు 82 సంవత్సరాలు. ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులను అందుకున్న డయానా రిగ్, ఆరు నెలల క్రితం క్యాన్సర్ బారిన పడి, అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని డయానా ప్రతినిధి సిమాన్ బేర్స్ ఫోర్డ్ వెల్లడించారు. డయానా గురువారం ఉదయం తన కుటుంబసభ్యుల మధ్య ప్రశాంతంగా ఈ లోకాన్ని వీడారని తెలిపారు. డయానా మృతికి హాలీవుడ్ ప్రముఖులు పలువురు సంతాపం తెలిపారు.
Diana Rigg
Avengers
Thor
PassesAway

More Telugu News