జనం మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు... అంతర్వేది ఘటనపై సీఎం జగన్ స్పందించాలి: పరిపూర్ణానంద

Paripoornananda Swamy demands Jagan must respond to Antarvedi incident
  • అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన
  • హిందువులకు అన్యాయం జరుగుతోందన్న పరిపూర్ణానంద
  • రథం దగ్ధం వెనుక కుట్ర దాగివుందని ఆరోపణ
ఏపీలో హిందువులకు అన్యాయం జరుగుతోందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి పరిపూర్ణానంద తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం జగన్ స్పందించాలని స్పష్టం చేశారు. మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన జనాలకు న్యాయం చేయాలి కదా? అంటూ వ్యాఖ్యానించారు. ఆలయాలపై జరుగుతున్న దాడికి ఉన్మాది కారణం అంటున్నారని పరిపూర్ణానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్నాయని, రథం దగ్ధం వెనుక కుట్ర దాగివుందని ఆరోపించారు. రథం అగ్నికి ఆహుతైన ఘటనపై నిరసన చేస్తుంటే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు.
Go Back to Shorts
Paripoornananda
Jagan
Antarvedi
Chariot Burning
Andhra Pradesh

More Telugu News