నిరుద్యోగులంతా చేతులు కలపండి.. రాత్రికి కొవ్వొత్తులు, లాంతర్లు వెలిగించండి: తేజస్వీ యాదవ్ పిలుపు

Tejashwi Yadav takes dig at CM Nitish Kumar
  • 9 గంటల 9 నిమిషాలకు లైట్లు ఆర్పివేయండి
  • మాకు అవకాశం లభిస్తే నిరుద్యోగ నిర్మూలనకు కృషి
  • ఇది రాజకీయ ఉద్యమం కాదు
బీహార్‌లో పెరిగిపోతున్న నిరుద్యోగానికి వ్యతిరేకంగా యువకులు చేతులు కలపాలని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నేటి రాత్రి 9 గంటల 9 నిమిషాలకు ప్రతి ఒక్కరు లైట్లు ఆర్పివేసి 9 నిమిషాలపాటు కొవ్వొత్తులు, లాంతర్లు వెలిగించి నిరసన తెలపాలని కోరారు. ఈ మేరకు ఫేస్‌బుక్ లైవ్ ద్వారా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్జేడీకి అవకాశం లభిస్తే నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తామన్నారు.

తమది రాజకీయ ఆందోళన కాదని, నిరుద్యోగులైన యువకులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ  ఉద్యమాన్ని చేపట్టాయని తెలిపారు. దీనికి ఆర్జేడీ పూర్తి మద్దతు ఇస్తోందన్నారు. నిరుద్యోగులంతా ఈ ఉద్యమంలో పాల్గొనాలని, రాత్రి 9 గంటల 9 నిమిషాలకు ప్రతి ఒక్కరు లాంతర్లు, కొవ్వొత్తులు వెలిగించాలని సూచించారు. నిరుద్యోగుల సమస్యలు తెలుసుకునేందుకు వెబ్‌సైట్, టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తామన్నారు. తాను కూడా తల్లి రబ్రీదేవితో కలిసి అదే సమయానికి ఇంట్లోని లైట్లు ఆర్పివేసి లాంతర్లు వెలిగిస్తామని తేజస్వీయాదవ్ తెలిపారు.
Go Back to Shorts
Tejashwi Yadvav
Bihar
Nitish Kumar
Unemployement

More Telugu News