అంతర్వేదిలో వీహెచ్ పీ, భజరంగ్ దళ్ ఆగ్రహాన్ని రుచిచూసిన ఏపీ మంత్రులు
- అంతర్వేదిలో ఉద్రిక్తత
- మంత్రులను నిలదీసిన హిందూ సంఘాలు
- పోలీసులకు, హిందూ సంఘాల కార్యకర్తలకు తోపులాట
హిందూ సంఘాల కార్యకర్తలను నిలువరించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా పోలీసులకు, వీహెచ్ పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను కూడా తోసుకుని హిందూ సంఘాల కార్యకర్తలు ముందుకు దూసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఏపీ మంత్రులు ఈ నెల 15 లోపు పకడ్బందీ విచారణ జరిపి దోషులను పట్టుకుంటామని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనికి హిందూ సంఘాలు బదులిస్తూ, ఈ నెల 15 లోపు బాధ్యులను పట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాయి. రథం అగ్నికి ఆహుతి కావడం వెనుక కుట్ర ఉందని వీహెచ్ పీ, భజరంగ్ దళ్ ఆరోపిస్తున్నాయి.