Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్ డేట్!

Single day spike of 75809 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
గత 24 గంటల్లో దేశంలో 75,809 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన బులెటిన్‌లో పేర్కొంది. అదే సమయంలో 1,133 మంది మృతి చెందారు.
     
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 42,80,423కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 72,775కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 33,23,951 మంది కోలుకున్నారు. 8,83,697  మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.  
                                               
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 5,06,50,128 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,98,621 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News