కంగనా రనౌత్ పై పరోక్ష విమర్శలు గుప్పించిన ఉద్ధవ్ థాకరే

ఉపాధిని పొందుతున్న నగరంపై కొందరికి కృతజ్ఞత ఉండదని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ను ఉద్దేశించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముంబైను పీవోకేతో కంగన పోల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవలే మరణించిన శివసేన ఎమ్మెల్యే అనిల్ రాథోడ్ కి ఈ రోజు ఉద్ధవ్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమకు ఉపాధిని కల్పిస్తున్న నగరంపై చాలా మందికి కృతజ్ఞత ఉంటుందని... కొందరికి మాత్రం ఉండదని చెప్పారు. అనిల్ భయ్యా రాజస్థాన్ నుంచి వచ్చారని, మహారాష్ట్రను తన నివాసంలా భావించారని... ఒక గొప్ప శివసైనికుడిగా మారారని అన్నారు.

మరోవైపు కంగనపై శివసేన నేతల విమర్శలు ఎక్కువైన సంగతి తెలిసిందే. ముంబైలో అడుగు పెట్టొద్దు అనే హెచ్చరికలు సైతం వినిపించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది.

Uddhav Thackeray
Kangana Ranaut
Shiv Sena
Bollywood

More Telugu News