Nagababu: గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించిన నాగబాబు

Nagababu accepts Green India Challenge and planted saplings in his house
  • నాగబాబును నామినేట్ చేసిన చమ్మక్ చంద్ర
  • మణికొండ నివాసంలో మొక్కలు నాటిన నాగబాబు
  • టీవీ నటుల పేర్లు నామినేట్
మెగాబ్రదర్ నాగబాబు గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించారు. సినీ, టీవీ నటుడు చమ్మక్ చంద్ర విసిరిన చాలెంజ్ కు ఓకే చెప్పిన నాగబాబు... హైదరాబాదు మణికొండలోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం ఈ చాలెంజ్ లో భాగంగా టీవీ నటులు భరణి, కలికిరాజ్ లను నామినేట్ చేశారు. ఈ చాలెంజ్ ను ప్రారంభించిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ కు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ సంతోష్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కు సినీ ప్రముఖుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.
Nagababu
Green India Challenge
Chammak Chandra
Bharani
Kalikiraj
Santosh Kumar

More Telugu News