Jagga Reddy: కేసీఆర్ దాని గురించి ఆలోచించకపోవడమే మేలు: జగ్గారెడ్డి

Mayawati will not support KCR says Jagga Reddy
  • జాతీయ పార్టీ పెడితే కేసీఆర్ నవ్వులపాలవుతారు
  • కేసీఆర్ ను జాతీయ స్థాయిలో ఎవరూ నమ్మరు
  • కేసీఆర్ కు శివసేన కూడా మద్దతు ఇవ్వదు
ప్రాంతీయ పార్టీని నడపడం, జాతీయ పార్టీని నడపడం రెండూ వేరని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఎప్పుడూ నాలుగు గోడల మధ్య కూర్చొనే నాయకుడు జాతీయ పార్టీని నడపలేడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీని పెడితే నవ్వులపాలు అవుతారని చెప్పారు. కేసీఆర్ ను జాతీయ స్థాయిలో ఎవరూ నమ్మరని అన్నారు.

దళిత వ్యతిరేకి అయిన కేసీఆర్ కు బీఎస్పీ అధినేత్రి మాయవతి మద్దతు ఇవ్వరని చెప్పారు. సిద్ధాంతాలు వేరు కావడంతో టీఆర్ఎస్ కు శివసేన కూడా మద్దతు పలకదని అన్నారు. ఢిల్లీ పీఠంపై కూర్చోవాలనే కల శరద్ పవార్, మాయావతిలకే నెరవేరలేదని... కేసీఆర్ దాని గురించి ఆలోచించకపోవడమే మేలని చెప్పారు. కేసీఆర్ కానీ, ఆయన మాటలు కానీ నమ్మదగినవి కావని అన్నారు.
Jagga Reddy
Congress
KCR
TRS

More Telugu News