Andhra Pradesh: విజయవాడ-హైదరాబాద్ రూటులో ప్రైవేట్ బస్సులకు అనుమతినిచ్చిన ఏపీ ప్రభుత్వం!

AP govt gives permission for private busses
  • అన్ లాక్ 4.0లో భాగంగా ప్రైవేట్ బస్సులకు అనుమతి  
  • తెలంగాణ ఆర్టీసీ అధికారులతో కొలిక్కి రాని చర్చలు
  • ప్రజల అవసరార్థం ప్రైవేట్ వాహనాలకు అనుమతి
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ లాక్ 4.0లో భాగంగా ప్రైవేట్ బస్సుల రాకపోకలకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ బస్సుల రాకపోకలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు కొలిక్కి రాకపోవడంతో... ప్రజల అవసరాల కోసం ప్రైవేట్ బస్సులకు అనుమతిని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విజయవాడ-హైదరాబాద్ రూటులో ప్రైవేట్ బస్సులకు అనుమతి ఇచ్చింది. పన్నులు చెల్లించి ప్రైవేట్ బస్సులు క్లియరెన్స్ తీసుకోవాలని సూచించింది. కరోనా నిబంధనలను పాటిస్తూ బస్సులను నడపాలని ప్రభుత్వం ఆదేశించింది.
Andhra Pradesh
Private Busses
Vijayawada
Hyderabad

More Telugu News