దారితప్పిన ముగ్గురు చైనీయులను రక్షించిన భారత సైనికులు
- సిక్కిం బోర్డర్ దాటిన చైనీయులు
- దారితప్పి పొరపాటున భారత్ లో ప్రవేశం
- ఆహారం, దుస్తులు అందించిన భారత సైన్యం
ఆహారాన్ని అందించడమే కాకుండా, శీతల వాతావరణం నుంచి రక్షించుకునేందుకు దుస్తులను కూడా ఇచ్చారు. అంతేకాదు, వారికి ఆక్సిజన్ ను కూడా అందించారు. ఈ విషయాన్ని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. అనంతరం వారు తిరిగి వెళ్లడానికి జవాన్లు సహకరించారు. ఈ సందర్భంగా మన సైన్యానికి చైనీయులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్ లో మన దేశానికి చెందిన ఐదుగురిని చైనా సైనికులు అపహరించడం గమనార్హం.