గుంటూరులో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న టిక్ టాక్ ప్రేమ జంట!
- గత నెలలో పెళ్లి చేసుకున్న శైలజ, పవన్
- చంపేస్తామని బెదిరించిన శైలజ తల్లిదండ్రులు
- ఉరి వేసుకుని ఆత్మహత్య
బెదిరింపులు రావడంతో శైలజ, పవన్ ఇద్దరూ భయపడిపోయారు. కలిసి బతకలేని పరిస్థితి నెలకొందనే బాధలో చనిపోవడానికి సిద్ధమయ్యారు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరోవైపు శైలజ సూసైడ్ లెటర్ రాసింది. తమ చావుకు తన తల్లి హేమలత, తండ్రి రవీంద్ర, బంధువు సుబ్రహ్మణ్యం కారణమని లేఖలో పేర్కొంది. మరోవైపు మృతదేహాలను పోస్టుమార్టానికి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.