నల్గొండ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

Road Accident in Nalgonda five dead
  • ధైర్యపురి తండా వద్ద ఘటన
  • హైదరాబాద్ నుంచి మల్లేపల్లి వెళ్తుండగా బోల్తాపడిన కారు
  • ట్రాఫిక్‌ను క్లియర్ చేసిన పోలీసులు
నల్గొండ జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి మల్లేపల్లి వెళ్తున్న కారు నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్ద అదుపు తప్పి వాటర్ పైప్‌లైన్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.
Go Back to Shorts
Nalgonda District
Hyderabad
Road Accident

More Telugu News