Samantha: నేను చివరిసారిగా ఏడ్చింది అప్పుడే: సమంత

Samantha gives answers to fans questions
  • 'ఫ్యామిలీమ్యాన్' సిరీస్ చూసేటప్పుడు ఏడ్చాను
  • వ్యవసాయం చేసే విషయం గురించి ఆలోచిస్తా
  • చదువు అంటే కేవలం చదువుకోవడం మాత్రమే కాదు
పెళ్లైన తర్వాత కూడా వరుస సినిమాలతో సమంత దూసుకుపోతోంది. రొటీన్ హీరోయిన్ పాత్రలు కాకుండా... హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ సత్తా చాటుతోంది. మరోవైపు సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ఆమె ముచ్చటిస్తూ... వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.

చివరిసారిగా మీరు ఎప్పుడు ఏడ్చారు? అని ఒక అభిమాని ప్రశ్నించగా... 'ఫ్యామిలీమ్యాన్' సిరీస్ చూస్తున్నప్పుడు  తాను ఏడ్చానని చెప్పింది. మరో అభిమాని మాట్లాడుతూ... మీకు వ్యవసాయంపై చాలా ఇంటరెస్ట్ ఉన్నట్టు అర్థమవుతోందని, నగర శివారుల్లో రైతులతో కలిసి వ్యవసాయం చేస్తే బాగుంటుందని సూచించాడు. దీనిపై ఆమె స్పందిస్తూ... మీ సలహా నచ్చిందని, దీని గురించి ఆలోచిస్తానని చెప్పింది.  

తనకు ఇష్టమైన పాత్ర అంటూ  ప్రత్యేకంగా ఏదీ లేదని... గతంలో కంటే భిన్నమైన పాత్రలను చేసేందుకు ఇష్టపడతానని సమంత తెలిపింది. చదువు అంటే కేవలం పుస్తకాలను చదవడం మాత్రమే కాదని, పిల్లల వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినదని... ఈ కార్యక్రమంలో తాను కూడా భాగం కావాలనుకుంటున్నానని చెప్పింది.
Samantha
Tollywood

More Telugu News