Sampoornesh Babu: పవన్ రిప్లయ్ ఇవ్వడంతో సంపూర్ణేశ్ బాబు సంబరాలు

Sampoornesh Babu on clouds after Pawan Kalyan replied to him
  • నిన్న పవన్ కల్యాణ్ బర్త్ డే
  • జన హృదయనేత అంటూ పవన్ కు విషెస్ తెలిపిన సంపూ
  • డియర్ సంపూర్ణేశ్ గారు అంటూ పవన్ ట్వీట్
టాలీవుడ్ లో సంపూర్ణేశ్ బాబు ఓ ప్రత్యేకమైన వ్యక్తి. హీరో అవడానికి బ్యాక్ గ్రౌండ్ అవసరం లేదని చాటినవాళ్లలో సంపూ కూడా ఒకడు. హృదయకాలేయం చిత్రంతో సంపూ రేపిన కలకలం అంతాఇంతా కాదు. ఇక అసలు విషయానికొస్తే, నిన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయనకు సంపూర్ణేశ్ బాబు కూడా విషెస్ తెలిపాడు. జన హృదయనేత, జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు. అందుకు పవన్ కల్యాణ్ కూడా ఎంతో వినమ్రంగా బదులిచ్చారు.

"ప్రియమైన సంపూర్ణేశ్ గారు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను" అంటూ స్పందించారు. పవన్ అంతటివాడు తన ట్వీట్ కు బదులివ్వడంతో సంపూ ఆనందం అంబరాన్నంటుతోంది. "అన్నా... మీ దగ్గర నుంచి ఈ రిప్లై రావడం ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. దీన్ని ఫొటో ఫ్రేమ్ కట్టించుకుంటాను" అంటూ తన హర్షం వెలిబుచ్చాడు.

Sampoornesh Babu
Pawan Kalyan
Birthday
Tweet
Reply
Tollywood

More Telugu News