తిరుమల మ్యూజియం వద్ద చిరుతపులి సంచారం
- గత రాత్రి తిరుమల వీధుల్లో తిరుగాడిన చిరుత
- సామాజిక మాధ్యమాల్లో వీడియో
- ఇటీవల తరచుగా తిరుమలలో వన్యప్రాణుల దర్శనం
దాంతో జంతువులు ఎలాంటి బెరుకు లేకుండా తిరుమల వీధుల్లో సంచరిస్తున్నాయి. తాజాగా, ఓ చిరుతపులి తిరుమల శ్రీవారి మ్యూజియం వద్ద గతరాత్రి తిరుగాడినట్టు వెల్లడైంది. మాడవీధికి సమీపంలో ఉన్న మ్యూజియం వద్ద గోడపై కాసేపు కూర్చున్న ఆ చిరుత అక్కడే కొద్దిసేపు సంచరించి అటవీప్రాంతంలోకి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.