Corona Virus: ఏపీ కరోనా అప్ డేట్: ఇరవై నాలుగు గంటల్లో 72 మరణాలు, 10,392 పాజిటివ్ కేసులు

Corona virus spreading continue in Andhra pradesh in a rapid way
  • గత 24 గంటల్లో 8,454 మందికి కరోనా నయం
  • రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,55,531
  • ఇప్పటివరకు 3,48,330 మందికి కరోనా నుంచి విముక్తి
ఏపీలో కరోనా వైరస్ శరవేగంగా పాకిపోతోంది. నిత్యం భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు వెల్లడవుతున్నాయి. తాజాగా, 60,804 శాంపిల్స్ పరీక్షించగా 10,392 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 1,199, చిత్తూరు జిల్లాలో 1,124 కొత్త కేసులను గుర్తించారు. అతి తక్కువగా కృష్ణా జిల్లాలో 397 కేసులు వచ్చాయి.

ఇక, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 72 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 4,125కి పెరిగింది. తాజాగా 8,454 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,55,531 కాగా, 3,48,330 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యం సంతరించుకున్నారు. ఇంకా 1,03,076 మంది చికిత్స పొందుతున్నారు.
Corona Virus
Andhra Pradesh
Positive
Deaths
Recovery
COVID-19

More Telugu News