Kangana Ranaut: ఆ నలుగురు హీరోలు డ్రగ్స్ వాడతారని చెప్పుకుంటున్నారు: బాంబు పేల్చిన కంగనా రనౌత్

Kangana Ranaut wants four actors to take a drug test
  • రణవీర్, రణబీర్, అయాన్, విక్కీలు కొకైన్ వాడతారనే ప్రచారం ఉంది 
  • వారు డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి
  • వారిపై పడ్డ అపవాదును తొలగించుకోవాలి
ఇప్పటికే పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ బాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టించిన హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్ లో డ్రగ్స్ సంస్కృతి ఎక్కువగా ఉందని ఇటీవల కామెంట్ చేసిన కంగన... తాజాగా హీరోల పేర్లు బయటపెట్టి మరో వివాదానికి నాంది పలికింది. రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, విక్కీ కౌశిక్ లు డ్రగ్ టెస్ట్ కోసం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని కోరుతున్నానంటూ ట్వీట్ చేసింది.

వీరు నలుగురూ కొకైన్ వాడతారనే ప్రచారం బాలీవుడ్ లో ఉందని కంగన తెలిపింది. డ్రగ్ టెస్ట్ చేయించుకుని... తమపై పడిన అపవాదును వారు తొలగించుకోవాలని చెప్పింది. రక్త పరీక్షల్లో వారికి  క్లీన్ రిపోర్ట్ వస్తే లక్షలాది మందికి స్ఫూర్తిదాతలుగా అవతరిస్తారని తెలిపింది. అంతే కాదు ... ఈ ట్వీట్ ను ప్రధాని మోదీ కార్యాలయానికి కూడా ట్యాగ్ చేసింది.
Kangana Ranaut
Ranveer Singh
Ranbir Kapoor
Ayan Mukerji
Vicky Kaushik
Bollywood
Drugs

More Telugu News