Corona Virus: దేశంలో ఒక్కరోజులో 78,357 కరోనా కేసులు.. 1,045 మంది మృతి

new 78357  coronavirus cases in india
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసులు అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 78,357 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 1,045 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
     
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 37,69,524కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 66,333 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 29,019,09 మంది కోలుకున్నారు. 8,01,282 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.  
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 4,43,37,201 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,12,367 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News