నన్ను ఇంకో కేసులో ఇరికించే కుట్ర: యోగిపై కఫీల్ ఖాన్ ఫైర్
- సీఏఏకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యల ఆరోపణలు
- హైకోర్టు ఆదేశాలతో గతరాత్రి జైలు నుంచి విడుదల
- ప్రభుత్వం రాజధర్మాన్ని మరిచి చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తోందని మండిపాటు
తనను ఇంకో కేసులో ఇరికించి జైలుకు పంపేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజధర్మాన్ని మరిచి చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, కోర్టు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో విడుదల చేసిందని అన్నారు. కాగా, కఫీల్ ఖాన్ తల్లి మాట్లాడుతూ.. తన కుమారుడు ఎన్నడూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని అన్నారు.