మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
- తన తండ్రి తుదిశ్వాస విడిచారని తనయుడు అభిజిత్ వెల్లడి
- మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆసుపత్రిపాలైన ప్రణబ్
- ఆపై కరోనా పాజిటివ్
- కొన్నిరోజుల కిందట కోమాలోకి వెళ్లిన వైనం
తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అభిజిత్ ట్విట్టర్ లో వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ కొన్నివారాల కిందట మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆసుపత్రిపాలయ్యారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఊపిరితిత్తులకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకింది. కొన్నిరోజులుగా ఆయన కోమాలోనే ఉన్నారు.