ఇంటిపై పాకిస్థాన్ జెండా ఎగరేశాడు... మూల్యం చెల్లించాడు!
- మధ్యప్రదేశ్ లో ఘటన
- వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
- సామరస్యతకు భంగం కలిగించాడంటూ కేసు
సామాజిక సామరస్యతకు భంగం కలిగిస్తున్నాడన్న ఆరోపణలపై అతడి మీద కేసు నమోదు చేశారు. అతడి నివాసం నుంచి పాక్ జెండాను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు కొద్దిమేర డ్రామా చోటుచేసుకుంది. ఈ జెండా ఎగురవేసిన విషయంలో రెవెన్యూ అధికారులు ఫారూఖ్ ఖాన్ ను ప్రశ్నించగా, మైనర్ అయిన తన కుమారుడు తెలియక ఎగరేశాడంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఆ జెండాను తాను అప్పుడే తగులబెట్టానంటూ అధికారులతో నమ్మబలికాడు.
కానీ సోదాలు చేయగా, ఆ జెండా సాధారణ స్థితిలోనే లభ్యమైంది. దాంతో అతడిపైనా, అతడి కుటుంబంలోని మరికొందరిపైనా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఫారూఖ్ ఖాన్ షిప్రా గ్రామంలో టైర్ రిపేరింగ్ షాపు నిర్వహిస్తున్నాడు.