kangana ranaut: ఓ ద‌ర్శ‌కుడు నాకు డ్ర‌గ్స్ రుచి చూపించాడు!: హీరోయిన్

director given drugs to me kangana
  • బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్ర‌గ్స్ తీసుకుంటారు
  • డ్ర‌గ్స్  స్మగ్లర్లను విచారిస్తే బయటపడతారు
  • బాలీవుడ్‌ ప్రముఖులు జైల్లో ఉంటారు
  • ఓ హీరోని భ‌రించ‌లేక ఆయన భార్య విడాకులు ఇచ్చింది
తాను గురువుగా చెప్పుకునే ఓ ద‌ర్శ‌కుడు తనకు కూడా డ్ర‌గ్స్ ను రుచి చూపించాడని హీరోయిన్ కంగనా రనౌత్ తెలిపింది. బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్ర‌గ్స్ తీసుకుంటారని కంగనా చెప్పింది. డ్ర‌గ్స్  స్మగ్లర్లను విచారిస్తే చాలా మంది బాలీవుడ్‌ ప్రముఖులు జైల్లో ఉంటారని తెలిపింది.  బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో విచారణ జరుపుతోన్న కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) ఆయన‌ ప్రేయసి రియా చక్రవర్తి వాట్సప్‌ చాటింగ్‌పై ఆరా తీయగా ఆమె  డ్రగ్స్ డీలర్లతోనూ సంప్రదింపులు జరిపేదని తేలిన విషయం తెలిసిందే.

దీంతో బాలీవుడ్‌లో డ్రగ్స్‌ అంశం చర్చనీయాంశంగా మారింది. కంగ‌నా రనౌత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఓ హీరో డ్ర‌గ్స్ వాడేవాడ‌ని ఆమె తెలిపింది. అధిక మోతాదులో వాటిని తీసుకోవ‌డంతో ఆయన ఆరోగ్యం క్షీణించి ఆసుప‌త్రిలో చేరాడ‌ని ఆమె తెలిపింది. ఆయనను ఇక  భ‌రించ‌లేక ఆ హీరో భార్య విడాకులు కూడా ఇచ్చిందని ఆమె చెప్పింది. ఆ త‌ర్వాత ఆ హీరోతో తాను డేటింగ్ చేశానని తెలిపింది. ఆయ‌న కుటుంబం తనను ఇబ్బందుల పాలు చేసే ప్ర‌య‌త్నం చేసింద‌ని చెప్పింది.
kangana ranaut
Bollywood

More Telugu News