బన్నీ సినిమాలో కీలక పాత్రలో జగపతి బాబు?

Jagapati Babu in Bunnys latest movie
  • సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీగా జగపతి  
  • బన్నీ, సుకుమార్ కాంబోలో 'పుష్ప'
  •  ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ  
  • త్వరలో మహబూబ్ నగర్ అడవుల్లో షూటింగ్
తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత జగపతిబాబు కెరీర్ మంచి ఊపందుకున్న సంగతి తెలిసిందే. పలు సినిమాలలో అద్భుతమైన పాత్రలను తనదైన శైలిలో పోషించి రక్తికట్టించారు. దీంతో ఏదైనా పవర్ ఫుల్ విలన్ పాత్ర లాంటిది వుంటే ముందుగా జగపతినే పరిగణలోకి తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఆయన మరో భారీ చిత్రంలో నటించనున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందే 'పుష్ప' చిత్రంలోని ఓ కీలక పాత్రకు ఆయనను ఎంచుకున్నట్టు చెబుతున్నారు. అయితే, ఆ పాత్ర ఏమిటన్నది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.

ఇదిలావుంచితే, అటవీ వాతావరణంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ఈ చిత్రంలో మరింత ఫిట్ నెస్ తో కనపడడం కోసం ప్రస్తుతం హీరో అల్లు అర్జున్ జిమ్ లో తీవ్రంగా వర్కౌట్స్ చేస్తున్నాడు. దీంతో బన్నీ ఇందులో మరింత కొత్తగా కనపడతాడని అనుకోవచ్చు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగును త్వరలో మహబూబ్ నగర్ సమీపంలోని అడవుల్లో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.  
Go Back to Shorts
Jagapathi Babu
Allu Arjun
Sukumar
Rashmika Mandanna

More Telugu News