అనారోగ్య సమస్యల నేపథ్యంలో రాజీనామాకు సిద్ధమైన జపాన్ ప్రధాని షింజో అబే
- త్వరలోనే అధికారికంగా ప్రకటన
- ఆరోగ్య సమస్యలతో అబే సతమతం
- ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకూడదని నిర్ణయం
కాగా, చాలా కాలంగా షింజో అబే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయనకు టోక్యోలోని ఓ ఆసుపత్రి వైద్యులు దాదాపు ఏడు గంటలపాటు వైద్య పరీక్షలు చేయడం చర్చనీయాంశమైంది. ప్రధాని పదవికి షింజో అబే రాజీనామా చేశాక ప్రస్తుత ఉప ప్రధాని తారో అసో తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు కథనాలు వస్తున్నాయి. జపాన్‌కు అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన నేతగా అబే రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.