తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు అతి భారీ వర్షాలు: వాతావరణ శాఖ
- బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
- రాష్ట్రంలోని 14 జిల్లాలకు భారీ వర్ష సూచన
- ఉభయ వరంగల్ జిల్లాల్లో నిన్న 12 సెం.మీ. వర్షపాతం నమోదు
ఒడిశా, దాని పరిసర ప్రాంతాలు, ఝార్ఖండ్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుండడంతోపాటు, రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి ఏర్పడడమే ఇందుకు కారణమని వివరించారు. కాగా, నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల్లో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.