అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారు: హైకోర్టులో పిల్ వేసిన వైసీపీ కార్యకర్తలు
- అంబటి రాంబాబుపై పిల్ వేసిన రాజుపాలెం వైసీపీ కార్యకర్తలు
- నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించిన హైకోర్టు
- తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా
వైసీపీ కార్యకర్తల తరపున హైకోర్టు న్యాయవాది నాగరఘు ఈ పిల్ ను దాఖలు చేశారు. వాదనలు విన్న హైకోర్టు... అధికారిక పార్టీకి చెందిన వారే పిటిషన్ వేస్తే... అది ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని ప్రశ్నించింది. అక్రమ మైనింగ్ పై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.