బిగ్ బాస్ - 4 బ్యాచ్ ఇదేనట!
- ఇప్పటికే 15 మంది పేర్లు ఖరారైనట్టు వార్తలు
- జాబితాలో పలువురు యాంకర్లు, టిక్ టాక్ స్టార్లు
- ఇంకా అధికారికంగా ప్రకటించని నిర్వాహకులు
ఇక, ఈ సంవత్సరం హౌస్ లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ లో కృష్ణవేణి సీరియల్ నటుడు సయ్యద్ సోహెల్, మహాతల్లి ఫేమ్ జాహ్మవి, ఆమె భర్త సుశాంత్, జెమినీ టీవీ యాంకర్ ప్రశాంతి, గాయకుడు నోయర్, రఘు మాస్టర్, ఆయన భార్య ప్రణవి, గాయని గీతామాధురి భర్త నందు, జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్, నటి కల్యాణి, యాంకర్, జోర్దార్ ఫేమ్ సుజాత, టిక్ టాక్ స్టార్ మెహబూబా దిల్ సే, దేత్తడి హారిక, కెవ్వు కామెడీ యాంకర్ అరియానా గ్లోరీ, టీవీ 9 యాంకర్ దేవిల పేర్లు ఖరారైనట్టు సమాచారం.
వీరితో పాటు హీరోయిన్ పూనమ్ బాజ్వా, వడ్లమాని ప్రియ, యామినీ భాస్కర్, అపూర్వ, అకిల్ సార్థక్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరిలో చాలామంది క్వారంటైన్ లో వున్నారు. ఇంతకీ వీరిలో ఎవరు లోపలికి వెళతారో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.