అనంతపురం ఆసుపత్రిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. కొవిడ్ వార్డులో విద్యుదాఘాతం
- గత రాత్రి 12 గంటల సమయంలో చెలరేగిన మంటలు
- గదిలో 24 మంది కొవిడ్ రోగులు
- ఆసుపత్రిని సందర్శించిన అసిస్టెంట్ కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే
సమాచారం తెలిసిన వెంటనే అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, ఎస్పీ సత్య ఏసుబాబు, ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను మరో వార్డుకు తరలించారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎస్పీ, అసిస్టెంట్ కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.