Keerthi Suresh: కీర్తి సురేశ్ సినిమాకు ఓటీటీ నుంచి మంచి ఆఫర్!

Keerti Suresh movie Miss India to be streamed on Netflix
  • ఇటీవలే కీర్తి సురేశ్ 'పెంగ్విన్' విడుదల
  • త్వరలో 'గుడ్ లక్ సఖి' కూడా ఓటీటీ ద్వారానే  
  • 'మిస్ ఇండియా'కు నెట్ ఫ్లిక్స్ నుంచి 11 కోట్ల ఆఫర్
కరోనా దెబ్బకు ఓటీటీ పంటపండింది. థియేటర్లు మూతబడడంతో పూర్తయిన సినిమాలను కొంతమంది ఓటీటీ వేదికల ద్వారా విడుదల చేసేస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలు.. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలను డిజిటల్ ప్లాట్ ఫాంపై రిలీజ్ చేస్తున్నారు. పైగా మంచి ఆఫర్లు వస్తుండడంతో ఒకరిని చూసి మరొకరు అటువైపు మళ్లుతున్నారు.

ఈ క్రమంలో కథానాయిక కీర్తి సురేశ్ నటించిన 'పెంగ్విన్' సినిమా ఆ మధ్య ఇలాగే ఓటీటీ ద్వారా విడుదలైంది. ఆ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాకపోయినప్పటికీ, ఆమె నటించిన మరో రెండు సినిమాలు కూడా ఓటీటీ ద్వారా రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాయి. వీటిలో ఒకటి 'గుడ్ లక్ సఖి' కాగా, మరొకటి 'మిస్ ఇండియా'.

నరేంద్రనాథ్ దర్శకత్వంలో కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో ఈ 'మిస్ ఇండియా' చిత్రాన్ని మహేష్ ఎస్. కోనేరు నిర్మించారు. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను తాజాగా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. పైగా, దీనికి 11 కోట్ల ఫ్యాన్సీ రేటు కూడా సదరు సంస్థ ఆఫర్ చేసినట్టు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ చేస్తారన్నది త్వరలోనే తెలుస్తుంది.  
Keerthi Suresh
OTT
Netfilx

More Telugu News