Jagan: బెంగళూరు ఎయిర్ పోర్టులో సీఎం జగన్ సందడి

CM Jagan arrives Banglore airport to sendoff his daughter
  • లండన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన జగన్ తనయ
  • మాస్టర్స్ డిగ్రీ కోసం ఇన్సీడ్ లో చేరిన హర్షారెడ్డి
  • కుమార్తెను పారిస్ పంపేందుకు బెంగళూరు వెళ్లిన సీఎం
సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి ఫ్రాన్స్ లోని ప్రపంచ ప్రఖ్యాత 'ఇన్సీడ్' బిజినెస్ స్కూల్ లో సీటు తెచ్చుకోవడం తెలిసిందే. వరల్డ్ టాప్-5 బిజినెస్ స్కూల్స్ లో 'ఇన్సీడ్' ఒకటి. హర్షారెడ్డి ఇటీవలే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసేందుకు ఆమె 'ఇన్సీడ్' లో చేరేందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో తన కుమార్తెను పారిస్ పంపించేందుకు సీఎం జగన్ ఈ సాయంత్రం బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ కు స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో అక్కడ కోలాహలం ఏర్పడింది. సీఎం జగన్ ఎల్లుండి తాడేపల్లి చేరుకుంటారని తెలుస్తోంది.
Jagan
Harsha Reddy
Bengaluru
Insead Business School
Paris

More Telugu News