Sunil Deodhar: ఎన్టీఆర్ పాతికేళ్ల కిందట ఇదే రోజున వెన్నుపోటు పొడిచినందుకు చంద్రబాబును టీడీపీ నుంచి బహిష్కరించారు: సునీల్ దేవధర్

AP BJP Co Incharge Sunil Deodhar slams Chandrababu
  • బీజేపీని, మోదీని కూడా చంద్రబాబు తిట్టాడన్న దేవధర్
  • త్వరలోనే రాజకీయాల నుంచి నిష్క్రమించక తప్పదని వ్యాఖ్యలు
  • ఎవరు చేసిన కర్మను వాళ్లు అనుభవించాల్సిందేనంటూ ట్వీట్
ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా 25 ఏళ్ల కిందట ఇదే రోజున టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు తనను వెన్నుపోటు పొడిచినందుకు చంద్రబాబును పార్టీ నుంచి తొలగించారని, ఈ రోజును చంద్రబాబు గుర్తుచేసుకుంటారనే భావిస్తున్నామని తెలిపారు.

చంద్రబాబు ఇటీవల బీజేపీ పైనా, ప్రధాని మోదీ పైనా అపవాదులు వేశారని సునీల్ దేవధర్ ఆరోపించారు. ఇప్పుడు అధికారం కోల్పోయాడని, త్వరలోనే రాజకీయ బరి నుంచి కూడా నిష్క్రమిస్తారని జోస్యం చెప్పారు. ద్రోహులు ఎవరి కర్మ వాళ్లు అనుభవించాల్సిందేనని ట్వీట్ చేశారు. అంతేకాదు, 1995 ఆగస్టు 25న ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు సహా ఐదుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు తెలుపుతూ నాటి అసెంబ్లీ స్పీకర్ కు పంపిన లేఖను కూడా సునీల్ దేవధర్ పంచుకున్నారు.

Sunil Deodhar
Chandrababu
NTR
Telugudesam
Narendra Modi
BJP
Andhra Pradesh

More Telugu News