Mohan Babu: త్వరలో మోహన్ బాబు కొత్త పాత్ర.. దర్శకుడిగా మారుతున్న వైనం!

తెలుగు చలన చిత్ర రంగంలో నటుడిగా మోహన్ బాబుది ఓ ప్రత్యేక స్థానం. విలన్ గా పరిచయమై.. అద్వితీయమైన పాత్రలు పోషించి, మెప్పించి.. తదనంతరం హీరోగా మారి, మరపురాని పాత్రలను తనదైన శైలిలో అభినయించి.. ప్రేక్షకులపై చెరగని ముద్రను వేశారాయన. అలాంటి మోహన్ బాబు త్వరలో దర్శకుడిగా మారుతున్నట్టు తెలుస్తోంది. ఎప్పటికైనా దర్శకుడిగా మారాలన్న తన చిరకాల కోరికను ఆయన నెరవేర్చుకోబోతున్నారు.

 ఇందుకోసం అప్పుడే ఆయన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఈ ప్రాజక్టుకు సంబంధించిన కథను ఇప్పటికే ఆయన రెడీ చేయించినట్టు సమాచారం. అయితే, ఇందులో ఎవరు నటిస్తారు? మోహన్ బాబు కూడా నటిస్తారా? అన్నది ఇంకా వెల్లడి కాలేదు. ఇక, అసలు మోహన్ బాబు కెరీర్ దర్శకత్వ శాఖ ద్వారానే జరిగింది. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. తర్వాత ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఈయనని 'స్వర్గం నరకం' సినిమా ద్వారా విలన్ గా పరిచయం చేశారు. ఆ తర్వాత కథ మనకు తెలిసిందే.
Mohan Babu
Villain
Dasari Narayana Rao

More Telugu News