పవన్ కల్యాణ్ కి జోడీగా పూజ హెగ్డే?
- 'అల వైకుంఠపురములో'తో పూజకు భారీ హిట్
- పవన్ కల్యాణ్ తో హరీశ్ శంకర్ సినిమా
- ముమ్మరంగా ప్రీ ప్రొడక్షన్ పనులు
- ప్రస్తుతం పూజ హెగ్డేతో చర్చలు
గతంలో పవన్ కల్యాణ్ తో 'గబ్బర్ సింగ్' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన హరీశ్ శంకర్ పవన్ తో మరో చిత్రాన్ని చేయనున్నాడు. హరీశ్ చెప్పిన కథకు పవన్ ఇప్పటికే ఓకే చెప్పేశాడు. దీంతో ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక హీరోయిన్ పాత్రకు పూజ హెగ్డేను తీసుకోవాలని దర్శకుడు హరీశ్ భావిస్తున్నాడట. దాంతో ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. దాదాపు ఆమె ఎంపిక పూర్తయినట్టేనని కూడా వార్తలొస్తున్నాయి.