బాలీవుడ్ నటి అథియాశెట్టితో కేఎల్ రాహుల్ ప్రేమాయణం.. ఎమోజీ పోస్టు చేసి క్లారిటీ ఇచ్చిన క్రికెటర్!
- తల్లి బర్త్‌డేను పురస్కరించుకుని ఫొటో షేర్ చేసిన అథియా
- లవ్ సింబల్ ఎమోజీ పోస్టు చేసిన రాహుల్
- కామెంట్లతో హోరెత్తిస్తున్న అభిమానులు
అథియా పోస్టుకు రాహుల్ స్పందించాడు. లవ్ సింబల్ ఎమోజీని పోస్టు చేసి పజిల్ విప్పేశాడు. తాను కూడా ప్రేమిస్తున్నట్టు చెప్పకనే చెప్పాడు. ఇది చూసిన అభిమానులు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. నిజానికి రాహుల్, అథియాలు ప్రేమించుకుంటున్నట్టు చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్‌లో రాహుల్ బర్త్‌డేను పురస్కరించుకుని అథియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాహుల్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. దానికి ‘మై పర్సన్’ అని క్యాప్షన్ తగిలించింది. ఇక అప్పటి నుంచి వారిద్దరి మధ్య ఏదో ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. వీటికి రాహుల్ తన తాజా కామెంట్‌తో మరింత బలం చేకూర్చినట్టు అభిమానులు తమ కామెంట్ల ద్వారా స్పష్టత ఇస్తున్నారు.