Chandrababu: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ ప్రత్యేక సందేశాలు

Chandrababu and Nara Lokesh conveys birthday wishes to Chiranjeevi
  • నేడు చిరంజీవి జన్మదినం
  • సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ
  • శ్రమజీవి అంటూ కొనియాడిన చంద్రబాబు
  • మరిన్ని జనరంజక పాత్రలు చేయాలన్న లోకేశ్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షల పోస్టులే దర్శనమిస్తున్నాయి. తాజాగా, టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా చిరంజీవికి విషెస్ తెలిపారు. అంచెలంచెలుగా ఎదుగుతూ, సినీ అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని , సినీరంగంలో చిరకీర్తిని సంపాదించుకున్న శ్రమజీవి చిరంజీవి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

"మీ స్వయంకృషి, సామాజిక సేవాస్ఫూర్తి యువతకు ఆదర్శం. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. నారా లోకేశ్ స్పందిస్తూ, "మెగాస్టార్ చిరంజీవి గారూ, మీరు మరిన్ని జనరంజకమైన పాత్రలతో సినీ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉండాలని, నిండు నూరేళ్లు ఆనంద ఆరోగ్యాలతో ఉల్లాసంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను" అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News