Times of India: టైమ్స్ జాబితా టాప్ టెన్ లో టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కడు!

Vijay Devarakond stood in 3rd place in Most Desirable Men of India list
  • 'మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియా' జాబితా విడుదల చేసిన టైమ్స్
  • మూడో స్థానంలో నిలిచిన విజయ్ దేవరకొండ
  • తొలి రెండు స్థానాల్లో షాహిద్, రణవీర్
ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన 'మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియా' జాబితాలో బాలీవుడ్ హీరోలు షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ లు నిలిచారు. మూడో స్థానంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నిలిచారు. జాబితాలోని టాప్ 10లో టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ మాత్రమే ఉండటం గమనార్హం. మరే తెలుగు హీరో టాప్ 10లో స్థానాన్ని దక్కించుకోలేకపోయాడు. గత కొంత కాలంగా విజయ్ దేవరకొండకు సరైన హిట్ రాలేదు. అయినప్పటికీ ప్రేక్షకుల్లో క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్నాడు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడుతోంది.
Times of India
Most Desirable Men India
Vijay Devarakonda
Tollywood
Bollywood

More Telugu News