సొంత దేశం, సొంత రిజర్వ్ బ్యాంకు... కైలాస దేశాధిపతి నిత్యానంద విలాసం!
- అత్యాచార ఆరోపణలతో దేశం వీడిన నిత్యానంద
- కరీబియన్ దీవుల్లో ఆవాసం!
- 'కైలాస' పేరిట సొంత దేశం ఏర్పాటు చేసినట్టు ప్రకటన
నాణేలు బంగారంతో తయారైనవని కైలాస దేశాధిపతి నిత్యానంద సెలవిచ్చారు. ఇక, తమ రిజర్వ్ బ్యాంకు విధివిధానాలను కూడా ఆయన వివరించారు. ఏ దేశానికి చెందిన కరెన్సీ అయినా కైలాస దేశంలో చెల్లుబాటు అవుతుందని, తమ కైలాస కరెన్సీ కూడా అన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతుందని తెలిపారు. ఈ మేరకు అనేక దేశాల బ్యాంకులతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. ఇందులో ఎంతమాత్రం వాస్తవం ఉందనేది భవిష్యత్తులో తేలనుంది.
