Sushant: 'సుశాంత్ తో బ్రేకప్ జరిగిపోయింది... నాకు నీ వల్లనే స్వేచ్ఛ'.. జూన్ 8న మహేశ్ భట్ తో రియా జరిపిన చాటింగ్ బహిర్గతం!

Times of India Reveled Unbelievable Chating of Riya and Mahesh Bhat
  • సీబీఐ విచారణకు సుశాంత్ ఆత్మహత్య కేసు 
  • ఇక వెనక్కు తిరిగి చూడవద్దన్న మహేశ్  
  • మహేశ్ భట్ తో రియా చాటింగ్ పై  'టైమ్స్ నౌ' ప్రత్యేక కథనం
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిపోయిన వేళ, మీడియా చేతికి చిక్కిన ఓ వాట్సాప్ చాటింగ్ వివరాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇది సుశాంత్ ప్రేయసిగా, ఆయన ఆత్మహత్యకు ప్రేరేపితురాలిగా చెప్పుకుంటున్న రియా చక్రవర్తి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మహేశ్ భట్ మధ్య జూన్ 8న జరిగింది కావడం మరింత సంచలనమైంది. ఇది నమ్మశక్యం కాని చాటింగ్ అని అభివర్ణిస్తూ, 'టైమ్స్ నౌ' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

 తనకు సుశాంత్ తో బ్రేకప్ జరిగిపోయిందని, నీ వల్ల నాకు స్వేచ్ఛ వచ్చిందని మహేశ్ భట్ ను ఉద్దేశిస్తూ పేర్కొంది. 'యూ హ్యావ్ అన్ క్లిప్డ్ మై వింగ్స్' అని రియా మహేశ్ భట్ కు చాట్ మెసేజ్ పంపగా, ఇక వెనక్కు తిరిగి చూడవద్దు (డోంట్ లుక్ బ్యాక్) అని ఆయన సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. మరో మెసేజ్ లో నీ బేషరతు ప్రేమ నాలో ఉన్న అన్ని అనుమానాలనూ తొలగించింది. నా హృదయ లోతుల్లోకి వెళ్లిందని కూడా రియా వ్యాఖ్యానించినట్టు వార్తా సంస్థ పేర్కొంది. 
Sushant
Riya
Mahesh Bhat
Chating

More Telugu News