Sabari Rever: శబరి నదిలో ప్రమాదం.. రెండు ముక్కలైన లాంచీ.. ముగ్గురి గల్లంతు!

Boat breaks in to two pieces in Sabari rever
  •  తూర్పుగోదావరి జిల్లా చింతూరు వద్ద ఘటన
  • లాంచీలో ఇతరులు ఎంతమంది ఉన్నారో అనే ఆందోళన
  • ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్, రెవెన్యూ సిబ్బంది

తూర్పుగోదావరి జిల్లా చింతూరు వద్ద శబరి నదిలో కాసేపటి క్రితం ప్రమాదం సంభవించింది. నదిపై నిర్మించిన బ్రిడ్జ్ పిల్లర్ ను ఢీకొన్న ఓ లాంచీ రెండు ముక్కలైంది. అనంతరం నీటిలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీస్, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. కల్లేరు పంచాయతీకి సరుకులు అందించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ఘటనలో లాంచీకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు గల్లంతైనట్టు తెలుస్తోంది. మరోవైపు, ఆ సమయంలో లాంచీలో ఇంకెంత మంది ఉన్నారనే విషయంపై ఆందోళన నెలకొంది.  చీకటిగా ఉండటంతో అక్కడి పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు. గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంది.

  • Loading...

More Telugu News