Revanth Reddy: కేసీఆర్ ప్రోత్సాహంతోనే జగన్ చెలరేగిపోతున్నారు: రేవంత్ రెడ్డి ధ్వజం

Revanth Reddy slams KCR over irrigation projects
  • కాపలా ఉండాల్సిన కేసీఆర్ దొంగలా మారారని వ్యాఖ్యలు
  • ఏపీ ప్రాజెక్టుల్లో కేసీఆర్ కు కమీషన్లు అందుతున్నాయని ఆరోపణలు
  • దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చుతున్నారని ఆగ్రహం
తెలంగాణకు కాపలాగా ఉండాల్సిన కేసీఆర్ దొంగలా మారారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల అంశంలో సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో కేసీఆర్ కు కమీషన్లు అందుతున్నాయని ఆరోపించారు. కమీషన్లకు కక్కుర్తిపడి దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చుతున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ ప్రోత్సాహంతోనే జగన్ చెలరేగిపోతున్నారని, ప్రాజెక్టుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అపెక్స్ కౌన్సిల్ అజెండాలో జీవో 69ని చేర్చకపోతే కోర్టుకు వెళతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనడానికి కేసీఆర్ ప్రణాళికలు రచించారని ఆరోపించారు.
Revanth Reddy
KCR
Projects
Irrigation
Jagan
Andhra Pradesh
Telangana

More Telugu News