tirupati: తిరుపతిలో యువకుడిపై చిరుత దాడి

Leopard attacked a person in Tirupati
  • జూపార్క్ వద్ద బైక్ పై వెళ్తున్న యువకుడిపై దాడి
  • పంజా విసరడంతో కాలుకి గాయాలు
  • తృటిలో తప్పిన ప్రాణాపాయం
తిరుపతిలో ఓ యువకుడిపై చిరుత దాడి చేసిన ఘటన స్థానికంగా భయాందోళనలను రేకెత్తించింది. వివరాల్లోకి వెళ్తే, ఈ ఉదయం జూపార్క్ వద్ద బైక్ వెళ్తున్న నాగరాజు అనే యువకుడిని చిరుత వెంటాడింది. అతనిపై పంజా విసిరింది. ఈ పంజా దెబ్బకు అతని ప్యాంట్ చిరిగిపోయింది. కాలుకు గాయాలయ్యాయి. అయితే అతను ఆగకుండా ముందుకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత అతను చికిత్స తీసుకున్నాడు. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్డులో కూడా చిరుత సంచారం ఇటీవల కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఘాట్ రోడ్డుపై వెళ్తున్న వారిపై చిరుత దాడికి యత్నించింది. దాని బారి నుంచి సురక్షితంగా తప్పించుకున్న బాధితులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు.
tirupati
Attack
Leapard

More Telugu News