JC Prabhakar Reddy: జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి.. కరోనా ట్రీట్మెంట్ కోసం నేరుగా హైదరాబాదుకు పయనం!

JC Prabakar Reddy released from jail and moved to Hyderabad for Corona treatment
  • కరోనా బారిన పడిన జేసీ ప్రభాకర్ రెడ్డి
  • పీపీఈ కిట్ వేసుకుని కారు ఎక్కిన టీడీపీ నేత
  • అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకోనున్నట్టు సమాచారం
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కడప జైలు నుంచి కాసేపటి క్రితం విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన హైదరాబాదుకు పయనమయ్యారు. ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కారు ఎక్కుతున్న సందర్భంలో ఆయన పీపీఈ కిట్ ను ధరించారు. ఆయన డ్రైవర్ కూడా పీపీఈ కిట్ ను ధరించడం గమనార్హం. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకోనున్నట్టు సమాచారం.
JC Prabhakar Reddy
Corona Virus
Telugudesam

More Telugu News