Logo: ఐపీఎల్ స్పాన్సర్ మారిన నేపథ్యంలో... కొత్త లోగో ఆవిష్కరణ!

New logo for IPL latest season after VIVO exit as official sponsor
  • ఐపీఎల్ నుంచి తప్పుకున్న వివో
  • కొత్త స్పాన్సర్ గా డ్రీమ్ 11
  • నయా స్పాన్సర్ పేరుతో కలిపి ఐపీఎల్ కొత్త లోగో రూపకల్పన
సుసంపన్నమైన టీ20 లీగ్ గా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ కు స్పాన్సర్ మారిన సంగతి తెలిసిందే. చైనా సంస్థ అన్న కారణంగా వివోపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఐపీఎల్ కు కొత్త స్పాన్సర్ వచ్చింది.

ఈ సీజన్ కు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు వివో ప్రకటించగా, ఆ స్థానంలో ఫాంటసీ గేమింగ్ సంస్థ డ్రీమ్ 11 ఐపీఎల్ కొత్త స్పాన్సర్ గా ఎంపికైంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లోగో కూడా మారింది. ఐపీఎల్ తో డ్రీమ్ 11 సంస్థ పేరును కూడా కలిపి నూతన లోగో రూపొందించారు. తాజాగా ఈ లోగోను విడుదల చేశారు. కాగా, ఐపీఎల్ పోటీలు ఈసారి యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు జరగనున్నాయి.
Logo
IPL 2020
Dream 11
VIVO
Sponstor
India
China

More Telugu News