అమెరికాలో కార్చిచ్చు బీభత్సం... అగ్నికీలల్లో ఉత్తర కాలిఫోర్నియా
- అమెరికాలో పిడుగుల వాన
- వేలాది ఎకరాల అడవి దగ్ధం
- ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు
- మంటలను ఆర్పే క్రమంలో హెలికాప్టర్ పైలెట్ మృతి
మొత్తం 186 చదరపు కిలోమీటర్ల పరిధిలో కార్చిచ్చు వ్యాపించినట్టు గుర్తించారు. ఇది క్రమంగా పొరుగు రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, మంటలను ఆర్పే క్రమంలో జరిగిన ప్రమాదంలో ఓ హెలికాప్టర్ పైలెట్ మృతి చెందాడు. కోలింగా పట్టణ సమీపంలో ఆ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ కార్చిచ్చుకు వాతావరణ మార్పుల వల్ల పడిన పిడుగులే కారణమని భావిస్తున్నారు. అధికవేడిమికి తోడు మూడ్రోజుల వ్యవధిలో 11 వేల పిడుగులు పడడంతో కార్చిచ్చు బయల్దేరిందని అంచనా వేశారు. కార్చిచ్చు కారణంగా ఉత్పన్నమైన వెలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలకు కూడా కనిపించింది.