అమెరికా చరిత్రలో తొలిసారి... 2 ట్రిలియన్ డాలర్ల మార్క్ ను తాకిన యాపిల్!
- పలు రకాల సేవల్లో విస్తరించిన యాపిల్
- ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉన్న సౌదీ ఆరామ్ కో
- ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన యాపిల్ మార్కెట్ కాప్
కాగా, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా, సౌదీకి చెందిన చమురు దిగ్గజం ఆరామ్ కో కొనసాగుతోంది. ఈ సంస్థ మార్కెట్ వాల్యూ సైతం గడచిన ఏడునెలల్లో 57 శాతం పెరిగింది. ఇక ఈ రెండు కంపెనీలనూ పక్కనబెడితే, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తదితరాలు ట్రిలియన్ డాలర్ల విలువకు అటూఇటుగా ఉన్నాయి. మొత్తం మీద యూఎస్ టెక్నాలజీ సంస్థల సంయుక్త మార్కెట్ కాప్ 6 ట్రిలియన్ డాలర్ల దగ్గర ఉంది. కరోనా వైరస్ సమయంలోనూ ఐఫోన్ల అమ్మకాలు జోరుగా సాగడమే యాపిల్ మార్కెట్ విలువను పెంచింది.