జనసేనను భగవంతుడే కాపాడాలి!: అంబటి వ్యాఖ్యలు
- హైదరాబాదులో జెండా ఎగురవేసిన బాబు, పవన్
- వీళ్లకు రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడే హక్కుందా? అన్న అంబటి
- ట్విట్టర్ లో ఘాటు పదజాలంతో అంబటికి రిప్లయ్ లు
- అసభ్య పదజాలంతో స్పందించారని అంబటి వెల్లడి
తన ట్వీట్ కు జనసైనికులు భారీగా స్పందించారని, అయితే గౌరవప్రదంగా, లాజిక్ తో స్పందించిన వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని, అదే సమయంలో అసభ్య పదజాలంతో, అసహనంతో స్పందించిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని వివరించారు. ఈ సంఖ్య ఎక్కువగా ఉన్నంత కాలం జనసేనను భగవంతుడే కాపాడాలని వ్యాఖ్యానించారు.